BREAKING NEWS

Monday, 26 March 2018

జనసేన పార్టీలోకి మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ

జనసేన పార్టీలోకి మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ


సోమవారం వామపక్ష నేతలు మధు, రామకృష్ణలతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్  మీడియాతో మాట్లాడారు.
గత కొద్ది రోజులుగా మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ జనసేనలోకి వెళ్తారన్న కథనాలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో  చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో పవన్‌ ఆ అంశంపై స్పందించారు. ‘మా పార్టీ లోకి‌ లక్ష్మీ నారాయణ వస్తారని‌ ప్రచారం జరుగుతోంది. గతం‌లో ఒక్కసారి మాత్రమే అయన నేను కలిశాను. మొన్న కూడా ఆవిర్భావ సభకు ముందు కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ నాకు ఆయన మెసేజ్ పెట్టారు. అంతే.. కానీ, ఆయన మా పార్టీ లోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వానిస్తా’ అని పవన్‌ తెలిపారు.

Friday, 2 March 2018

రంగస్థలం మాస్ బీట్ తో రిలీజయినా సెకండ్ సింగల్

రంగస్థలం మాస్ బీట్ తో రిలీజయినా సెకండ్ సింగల్

 మెగా అభిమానులనే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా  రంగస్థలం.
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గత ఏడాదిన్నర గా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు.ఐతే హోలీ  కానుకగా చిత్ర యూనిట్  రెండో సాంగ్‌ రిలీజ్ చేసింది. రంగా.. రంగా... రంగస్థలానా రంగుపూసుకోకున్నా... అంటూ సాగే ఈ మాస్‌ బీట్‌ను కాసేపటి క్రితం దర్శక నిర్మాతలు విడుదల చేశారు. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. రాహుల్‌ గాత్రం...  అందుకు రాక్ స్టార్  దేవి శ్రీప్రసాద్‌ అందించిన బాణీ అద్భుతంగా ఉంది. వినబడేట్లు కాదు రా.. కనబడేట్లు కొట్టండహే అంటూ రామ్ చరణ్ వాయిస్  ఓవర్‌ తో మాస్‌ బీట్‌ సాంగ్‌ను దేవీ అందించాడు. రంగస్థలం ఊరు నేపథ్యంలో సాగే ఈ పాటలో చెర్రీ స్టైలింగ్‌ కూడా అద్భుతంగా ఉంది.

సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌నిర్మిస్తున్నారు. కథానాయక పాత్రలో సమంత, ఇతర కీలక పాత్రల్లో ఆది, అనసూయ తదితరులు నటించగా.. పూజా హెగ్డే ప్రత్యేక పాటలోఅలరించనుంది. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.​

Wednesday, 7 February 2018

అంతరిక్షం లోకి కారును మోసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్

అంతరిక్షం లోకి కారును మోసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్


ఫ్లారిడా ‌: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రయోగం మంగళవారం జరిగింది.నింగిలోకి  దూసుకెళ్లిన రాకెట్‌ కారును అంతరిక్షంలోకి విజయవంతం గా మోసుకెళ్లింది. అంగారకుడి కక్ష్యలోకి టెస్లా రోడ్‌స్టర్‌ కారు చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్‌ ఎక్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది.

ఫాల్కన్‌ హెవీ రాకెట్‌కుఅమర్చినటువంటి  27 ఇంజిన్లను క్రమపద్దతిలో మండించినశాస్రవేత్తలు  ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఇంజిన్ల నుంచి వెలువడి పొగ పెద్ద పర్వతంలామరిపించేలా ఉంది.ఈ హెవీ  రాకెట్‌ నుండి  వెలువడిన శబ్దానికి  స్పేస్‌ కోస్ట్‌అంతా  కంపించిపోయింది. ఆరు గంటలసేపు జరిగిన  ప్రయోగాన్ని శాస్త్రజ్ఞులుప్రత్యక్షంగా  తిలకించారు.

ఈ రాకెట్లను పునర్వినియోగించుకోగల ప్రత్యేకత ఫాల్కన్‌ హెవీ సొంతం. 23 అంతస్తుల ఎత్తు ఉండే ఫాల్కన్‌ హెవీ రాకెట్స్  ప్రయోగం  అనంతరం తిరిగి  కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌కు తిరిగి చేరుకున్నాయి. అయితే, ఒక రాకెట్‌ మాత్రం  మధ్యలోనే కుప్పకూలిపోయింది.

ఈ ప్రయోగం పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శాస్త్రవేత్తలు అభినందిస్తూ ట్వీట్ చేసారు.
రాష్ట్ర ప్ర‌భుత్వం మీద న‌మ్మ‌కం పోతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

రాష్ట్ర ప్ర‌భుత్వం మీద న‌మ్మ‌కం పోతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్


ప్ర‌భుత్వాలు భిన్న వాద‌న‌లు చెబుతున్నాయ‌ని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో యూపీఏ ప్ర‌భుత్వం ఆంధ్రప్రదేశ్ కి  న్యాయం చేయ‌లేద‌ని అన్నారు. అపారమైన  రాజ‌కీయ అనుభ‌వం గలిగిన న‌రేంద్ర‌ మోదీ, చంద్ర‌బాబు నాయుడు గారు మన సమస్యలను  పరిష్కరించగలరు అని నమ్మి వారిని ఎన్నికల్లో స‌మ‌ర్థించాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర త‌రువాత కూడా రాష్ట్ర ప్ర‌త్యేక హోదా గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెలుసుకున్నాన‌ని తెలిపారు.

ప్ర‌త్యేక హోదాపై తాను తిరుప‌తి, కాకినాడల్లో స‌భ‌ల్లో అడిగానని పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్ని రోజుల‌కి ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా  ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని అన్నారని తెలిపారు. ప్ర‌త్యేక హోదాను తెలుగుదేశం నేత‌లు ఒక‌సారి బాగుంది అని , ఒక‌సారి బాగోలేద‌ని అంటారని విమ‌ర్శించారు. రక రకాల మాట‌ల‌తో ప్రజలను చాలా తిక‌మ‌క చేస్తున్నారనిఅన్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవేవీ నెరవేర్చడం లేదనిమండిపడ్డారు.
విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల‌ను ఎందుకు అమ‌లు చేయలేకపోతున్నారు అని అయన ప్ర‌శ్నించారు.

Monday, 22 January 2018

జనసేన స్పెషల్ బైక్ ఎక్కిన పవన్ కళ్యాణ్

జనసేన స్పెషల్ బైక్ ఎక్కిన పవన్ కళ్యాణ్


జగిత్యాల జిల్లా, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అనంతరం కరీంనగర్ చేరుకొని ప్రెస్ మీట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి ఆయన జనసేన కార్యకర్తలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా, అక్కడ పవన్ కల్యాణ్ అభిమానులు ,జనసేన  కార్యకర్తలు ప్రదర్శనకు ఉంచిన జనసేన బైక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. జనసేన పార్టీ గుర్తులతో ఈ బైకుని ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ బైకును అభిమానులు పవన్ కల్యాణ్‌కి చూపించారు. బైకులు అంటే అమితంగా ఇష్టపడే ఆయన బైక్ ను చూసి వారికి ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వెనుక చిరంజీవి హస్తం ఉందా?

రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వెనుక చిరంజీవి హస్తం ఉందా?


ఈరోజు ఉదయం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అనంతరం కరీంనగర్ చేరుకున్న ఆయన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.2009 ప్రజారాజ్యం ఎన్నికల ప్రచార సమయంలో వచ్చినప్పుడు కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరిగిందని, ఆంజనేయస్వామి దయ వల్ల అప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డానని చెప్పారు. సంపూర్ణ రాజకీయ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవాలని అనుకున్నానని, అందుకే స్వామి వారిని దర్శించుకున్నానని ఆయన చెప్పారు.కాగా మీరు రాజకీయాల్లోకి రావడం వెనుక మీ అన్నయ్య చిరంజీవి గారి హస్తం ఉందా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధాం ఇస్తూ "నేను రాజకీయాల్లోకి రావడానికి, చిరంజీవి గారికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఇది నేను తీసుకున్న నా సొంత నిర్ణయం. ఎవరి మద్దతూ నాకు లేదు. నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్లిపోతా. ఎన్ని స్థానాల్లో జనసేనకు బలం ఉందో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం." అని బదులిచ్చారు.
పవన్ రాజకీయ యాత్ర పై స్పందించిన రాంచరణ్

పవన్ రాజకీయ యాత్ర పై స్పందించిన రాంచరణ్


జనసేన అధినేత,నటుడు  పవన్ కళ్యాణ్ ఈరోజు జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుండి రాజకీయ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసినదే.ఈ యాత్ర పై పలువురు ప్రముకులు హర్షం వ్యక్తం చేసారు. ఇదే విషయమై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కూడా స్పందిస్తూ ఫేస్ బుక్ లో బాబాయ్ కి విషెస్ తెలిపారు. " నేను భారతీయుడిని,నా దేశాన్ని నేను కాపాడుకుంటాను"  అంటూ తాజా గా పవన్ చేసిన వ్యాఖ్యలను జత  చేస్తూ చలోరే చల్ ప్రారంభానికి మంచి ఎనర్జీ ఇచ్చారు.అల్ ది బెస్ట్ బాబాయ్,  జై జనసేన అంటూ పోస్ట్ చేసారు .ఈ పోస్ట్ చూసిన  మెగా అభిమానులు తెగ మురిసిపోతూ జై జనసేన అంటూ కామెంట్స్ ఇస్తున్నారు .