ప్రభుత్వాలు భిన్న వాదనలు చెబుతున్నాయని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయలేదని అన్నారు. అపారమైన రాజకీయ అనుభవం గలిగిన నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు గారు మన సమస్యలను పరిష్కరించగలరు అని నమ్మి వారిని ఎన్నికల్లో సమర్థించానని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర తరువాత కూడా రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెలుసుకున్నానని తెలిపారు.
ప్రత్యేక హోదాపై తాను తిరుపతి, కాకినాడల్లో సభల్లో అడిగానని పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్ని రోజులకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నారని తెలిపారు. ప్రత్యేక హోదాను తెలుగుదేశం నేతలు ఒకసారి బాగుంది అని , ఒకసారి బాగోలేదని అంటారని విమర్శించారు. రక రకాల మాటలతో ప్రజలను చాలా తికమక చేస్తున్నారనిఅన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవేవీ నెరవేర్చడం లేదనిమండిపడ్డారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని అయన ప్రశ్నించారు.
Categories:
News
Politics News
