ఫ్లారిడా : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగం మంగళవారం జరిగింది.నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ కారును అంతరిక్షంలోకి విజయవంతం గా మోసుకెళ్లింది. అంగారకుడి కక్ష్యలోకి టెస్లా రోడ్‌స్టర్ కారు చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టించింది.
ఫాల్కన్ హెవీ రాకెట్‌కుఅమర్చినటువంటి 27 ఇంజిన్లను క్రమపద్దతిలో మండించినశాస్రవేత్తలు ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఇంజిన్ల నుంచి వెలువడి పొగ పెద్ద పర్వతంలామరిపించేలా ఉంది.ఈ హెవీ రాకెట్ నుండి వెలువడిన శబ్దానికి స్పేస్ కోస్ట్‌అంతా కంపించిపోయింది. ఆరు గంటలసేపు జరిగిన ప్రయోగాన్ని శాస్త్రజ్ఞులుప్రత్యక్షంగా తిలకించారు.
ఈ రాకెట్లను పునర్వినియోగించుకోగల ప్రత్యేకత ఫాల్కన్ హెవీ సొంతం. 23 అంతస్తుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్స్ ప్రయోగం అనంతరం తిరిగి కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు తిరిగి చేరుకున్నాయి. అయితే, ఒక రాకెట్ మాత్రం మధ్యలోనే కుప్పకూలిపోయింది.
ఈ ప్రయోగం పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శాస్త్రవేత్తలు అభినందిస్తూ ట్వీట్ చేసారు.
Congratulations @ElonMusk and @SpaceX on the successful #FalconHeavy launch. This achievement, along with @NASA’s commercial and international partners, continues to show American ingenuity at its best! pic.twitter.com/eZfLSpyJPK— Donald J. Trump (@realDonaldTrump) February 7, 2018
Categories:
News
Technology
world
