‘అజ్ఞాతవాసి’ చిత్రం విషయంలో అందరూ డైరెక్టర్ త్రివిక్రమ్‌ని తప్పుబడుతూ .. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర రిజల్ట్ విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్‌ది ఏం తప్పులేదంటూ.. మరోసారి వర్మ తనదైన తరహాలో ట్వీట్ చేశారు. మొత్తం పవన్ కల్యాణే చేశాడు అనే విధంగా ఉన్న ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ని వర్మ పొగిడినట్లు ఉన్నప్పటికీ.. ట్వీట్ మొత్తం చదివినవారికి మరోసారి వర్మ.. ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌పై సెటైర్ వేసినట్టుగా ఉంది ఈ ట్వీట్.
‘‘అజ్ఞాతవాసి రిజల్ట్‌కి డైరెక్టర్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పీకే లాంటి ఆకాశం మీద దుప్పటి కప్పడం స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కెమరూన్ తరం కూడా కాదు.’’
Agnyaathavaasi result ki directorni blame cheyyadam correct kaadhu ..Yendhukante P k laanti aakasham meedha duppati kappadam Steven Spielberg James Cameron tharam kooda kaadhu🙏— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2018
