Saturday, 20 January 2018

ముందు ఆహారమా? వ్యాయామమా ?


వ్యాయామం అనగానే మనకు వచ్చే ప్రధాన సందేహం ఆహారం ఎప్పుడు తీసుకుంటే మంచిది ? వ్యాయామం అనేది ఆహారం తీసుకున్నాక  మొదలుపెట్టాలా? లేదా వ్యాయామం చేశాక ఆహారం తీసుకోవాలా ? అని.దీని పైన ఎప్పటికి చాలా పరిశోధనలే జరిగాయి.తాజాగా అమెరికాలో ఓ  పత్రిక వందలాది మంది వ్యాయామ శిక్షకులతో కలిసి అధ్యయనం చేసింది. ఈ సమగ్ర సర్వే ఆహారం తీసుకోకుండా చేసే వ్యాయామం ఉత్తమం అని తెలిపింది. తిన్నాక చేసే వ్యాయామం వల్ల.. శరీరం అయోమయం లో పడిపోతుందట. పరగడపున వ్యాయామం చేస్తే కొవ్వులు కరగడం, కెలోరీలు తగ్గడం, కండలు పెరగడం ఇవన్నీ ఎలాంటి అడ్డంకి  లేకుండా జరిగిపోతాయట. రాత్రంతా శరీరంలో పేరుకున్న కొవ్వు ఒక్కసారిగా కరగడానికి  అప్పుడే సులువుగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పైగా అప్పుడే నిద్ర లేవడం వల్ల శరీరానికి ఆకలి కూడా ఉండదంటున్నారు. అంటేదీని అర్ధం నిద్రలేచిన అర గంటలోపలే వ్యాయామాలు  చేయాలి అని.కావాలి అనుకుంటే  గుడ్లూ, పెరుగు లాంటివి తినొచ్చు. కానీ అవి తిన్న గంట తర్వాతే వ్యాయామం చేయాలట.

Share This