Friday, 19 January 2018

ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో రాజమౌళి సరికొత్త ప్రయోగం


బాహుబలి సినిమా తో తన సత్తా  ఏంటో చూపాడు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. తాను చేసే సినిమాలు ఎప్పుడు ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా ఉంటాయని చెప్పినఅయన  తాజాగా మరో ప్రయోగం చేసేందుకు సంసిద్ధం అయ్యాడు . ఎన్టీఆర్ - రాంచరణ్ లతో కలిసి చేసే మల్టీస్టారర్ కి రాజమౌళి సహా ఎవరు ముందుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా 40 కోట్ల బడ్జెట్ లోపే నిర్మించాలన్నది అయన ఆలోచన.

బిజినెస్ ఆధారంగా వచ్చే  లాభాలను షేర్  చేయబోతున్నారని ఇండస్ట్రీ లో టాక్ .  వీలైనంత తక్కువ షెడ్యూల్స్, వాటికి  సరిపడా తక్కువ బడ్జెట్ లతో  సినిమాలు రూపొందించాలన్నది ప్లాన్. ఇదేం ఐతేనే రాజమౌళి ఇలా ముందు అడుగు వేయడం పై  ప్రశంసలు కూడా మొదలయ్యాయనిసమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించితారక్ , చెర్రీ లకు రాజమౌళి కొన్ని దిశానిర్దేశాలు చేశారట. ప్రస్తుతం రామ్‌చరణ్ తన తదుపరి చిత్రం ‘రంగస్థలం’తో బిజీగా ఉన్నారు.  మరోవైపు ఎన్టీఆర్ కూడా  త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి తన సినిమాను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇరువురిని తమ చిత్రాలను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసుకోవాలని రాజమౌళిఆంక్షలు విధించారట.

Share This