Friday, 19 January 2018

యాంకర్ ప్రదీప్ కు శిక్ష ఖరారు చేసిన కోర్టు !


హైదరాబాద్:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్‌కు నాంపల్లి కోర్టు మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాకుండా రూ. 2,100 జరిమానా కూడా విధించింది. డ్రంకన్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మీరే తాగి వాహనం నడిపితే ఎలా అని కోర్టు ప్రశ్నించినట్టు సమాచారం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు విచారణలో భాగంగా టీవీ యాంకర్‌ ప్రదీప్‌ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

ప్రదీప్ మీడియాతో  మాట్లాడుతూ,డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దంటూ ప్రచారం చేస్తున్న మీరు ఇలాంటి పనులు చేయొద్దని మేజిస్ట్రేట్ తనకు సూచించినట్టు చెప్పాడు. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకుంటానని అన్నాడు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నాడు.


Share This