Saturday, 20 January 2018

మరో మెగా హీరో ఎంట్రీ ఖరారు


మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల తరువాత రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, శిరీష్‌ లాంటి యువ హీరోలు  వచ్చారు. తాజాగా చిరంజీవి చిన్నల్లుడు ఐన కళ్యాణ్‌ఎం కానుగంటి ని కూడా వెండి తెర కు హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్టుగా ప్రచారం. ఇప్పుడు మరో మెగా హీరో ఎంట్రీ పై గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరో  సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు ఐన వైష్ణవ్‌ తేజ్‌  కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట. ఈ మెగా మేనల్లుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తీసుకున్నారని టాక్. కొత్త దర్శకుడి సినిమాతో వైష్ణవ్‌ తేజ్ హీరోగా పరిచయం అయ్యే అకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడనుందన్న టాక్ వినిపిస్తోంది.



Share This