అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మరోసారి ముందుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ కలిగిన సభ్యులకు ఇవాళ మధ్యాహ్నం 12 గం.ల నుంచి, ఇతరులకు రాత్రి 12 గం.ల నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది అని తెలిపింది. ఈ సేల్ జనవరి 24 వరకు జరగనుంది. మొబైల్స్, కిచెన్, ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్స్ , ఇతర గృహావసరాలపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రవేశ పెట్టబోతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ కార్డు,అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో అదనంగా పది శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ప్రైమ్ సభ్యులు మొబైల్ యాప్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ముందుగా తమ కార్ట్‌లో యాడ్ చేసుకుని, సేల్ ప్రారంభమైన తర్వాత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
మోటోరోలా,వన్‌ప్లస్,ఆపిల్ , శాంసంగ్, కూల్‌ప్యాడ్, ఎమ్ఐ, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీల పైన 40 శాతం వరకు, కెమెరాలు, టీవీలు, వైఫై రూటర్లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 55 శాతం వరకు, మిక్సీలు,వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు వంటి గృహోపకరణాలపై 50 శాతం వరకు, ఇక ఇతర గృహావసర వస్తువులపై 75 శాతం వరకు, ఫ్యాషన్ బ్రాండ్లపై 40-80 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది.
Categories:
News