Tuesday, 16 January 2018

మెగా ఫోన్ పట్టే ఆలోచనలో ధనధన్ ధన్ రాజ్



హాస్యనటుడుతనకంటూ  ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ధన్ రాజ్.. అప్పడప్పుడు హీరోగా కూడా తెరపై కనిపిస్తున్నాడు. ఇక  ఇటీవల 'ధనలక్ష్మీ తలుపుతడితే'  అనే సినిమాతో నిర్మాతగా మారి చేతులు కాల్చుకొని ఇకపైన సినిమాలు నిర్మించకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే మెగాఫోన్ చేత పట్టుకొని  దర్శకుడిగా మారాలని ఉంది అని తాజాగా ఓ వెబ్ఇ ఛానల్ కి  ఇంటర్వ్యూలో చెప్పాడు.

"త్వరలోనే ఒక సినిమాకు డైరెక్షన్  వహించే ఛాన్స్ వుంది. కానీ అది వచ్చే సంవత్సరమా .. ఆపై సంవత్సరమా? అనేది మాత్రం ఇంకా తెలియదు. స్క్రిప్ట్ అయితే రాసుకునిరెడీ గా పెట్టుకున్నాను . వేరేవాళ్లయితే నా ఆలోచనను నేను అనుకున్నట్టు  అలాగే తీయగలరా? లేదా? అనే ఒక భయం వల్లనే నేనే డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. డైరెక్షన్ చేసే అవకాశం మాత్రం కచ్చితం వుంది" అంటూ చెప్పాడు.

Share This