Tuesday, 16 January 2018

వృద్ధుడిని చొక్కా ప‌ట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసు.. సీసీ కెమెరాలో రికార్డు


క‌ర్ణాట‌క‌లోని చిక్‌మ‌గ‌ళూరు పట్టణం లో ఓ పోలీసు కానిస్టేబుల్ వృద్దుడి పైన దౌర్జన్యానికి దిగాడు. శారదాంబ ఆల‌యంలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన ఓ వృద్ధుడి చొక్కాను ప‌ట్టుకుని బయటకి  ఈడ్చుకెళ్లాడు. చుట్టూ భ‌క్తులందరూ చూస్తుండగానే పోలీసు  దౌర్జన్యానికి పాల్పడిన ఆ దృశ్యాలు అక్క‌డి ఉన్న ఆలయ సీసీ కెమెరాలోనమోదు అయ్యాయి . మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఐన దేవేగౌడ కుటుంబ స‌భ్యులు ఆల‌యంలో ఉన్న కార‌ణంగా ఆ వృద్ధుడిని ఆలయం లోకి రావ‌ద్ద‌ని పోలీసులు చెప్పిన‌ట్లు  తెలుస్తోంది.  అనంతరం వృద్ధుడిపై దౌర్జ‌న్యానికి దిగిన కానిస్టేబుల్‌ని అధికారులు స‌స్పెండ్ చేసినట్టు సమాచారం.

Share This