Monday, 15 January 2018

కృష్ణా నదిలో మరో పడవ బోల్తా


నాగాయలంక : కృష్ణా నదిలో సోమవారం సాయంత్రం పడవ బోల్తా పడిన సంఘటన  జరిగింది. కృష్ణాజిల్లా లోని ఎదురుమొండి దీవుల ప్రాంతం నుంచి ప్రయాణికులతో వస్తుండగా  బోల్తాపడింది. పడవలోప్రయాణిస్తున్న మొత్తం 20 మందినీ  స్థానికులు కాపాడారు.అయితే , పడవలో ఎక్కించిన 4 బైక్‌లు, ఇతర వస్తువులు మాత్రం నీటిపాలయ్యాయి.

ఎదురుమొండి దీవుల వద్ద  ప్రయాణికులను దాటించడానికి వాడే  పంట్‌ను అధికారులు పడవల పోటీల కోసం నాగాయలంకకు తరలించడంతో  ప్రజలు తప్పక నాటు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సామర్థ్యం మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం.

గత నెల నవంబర్‌ 12న కృష్ణానదిలో అనుమతి లేని పడవ బోల్తాపడి 22 మంది పర్యాటకులు దుర్మరణం పాలైన సంగతి మరవక ముందే ఇలా జరగడం దురదృష్టకరం. 

Share This