వరుస సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది.ఇక దివ్య దర్శనానికి (కాలినడక ) భక్తులకు సుమారుగా 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (వీఐపీ) దర్శనానికి కూడా 8 గంటల సమయం వరకూ పడుతోంది. భక్తుల రద్దీ ఉండడంతో కాలినడక భక్తులకు మరుసటి రోజు దర్శన సమయం కేటాయిస్తున్నారు. ఇక అద్దె గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి అద్దె గదుల కోసం క్యూ లైన్ల లో ఎదురుచూస్తున్నారు.
Categories:
Bakthi
