పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో రాజీ పడ్డ కత్తి మహేష్
Published: January 19, 2018
హైదరాబాద్: కత్తి మహెష్ ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కత్తి మహేష్ శుక్రవారం రోజున మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది పవన్ ఫ్యాన్సే అని అనుమానిస్తూ ఆయన ఫిర్యాలో పేర్కొన్నాడు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటలు గడవక ముందే సీసీ ఫుటేజీ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు.
ఫిర్యాదు చేసిన అనంతరం శుక్రవారం రాత్రి 9:00 గంటల నుండి మహాన్యూస్ డిబెట్‌లో పాల్గొన్న కత్తి మహెష్ .. డిబేట్ అనంతరం పవన్ అభిమానులపై పెట్టిన కేసును ఉహసంహరించుకున్నాడు. డిబేట్ లో పాల్గొన్న జనసేన పార్టీ కార్యకర్త ,పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణ్ సుంకర -కత్తి మహేష్ ల మధ్య సయోధ్యే ఇందుకు కారణం.ఇకపై ఇరువర్గాల మధ్య ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది అనీ,అభిమానులు శాంతించడానికి కొంత సమయం పడుతుంది అని,కత్తి మహేష్ గారు సహకరించాలి అని కోరారు.అందుకు కత్తి మహెష్ కూడా సానుకూలం గా స్పందించారు.
