అప్రహిత రాజకీయ యాత్ర కై జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయుని సన్నిధికి బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఈ ఉదయం ఆయన సతీమణి అన్నా లెజినోవా ఎఎదురొచ్చి హారతి ఇచ్చారు. అంతకుముందు అభిమానుల కోలాహలం మధ్య పవన్ కు అక్కడికి వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు.
అనంతరం పవన్ అయన సతీమణి ని దగ్గరకు తీసుకుని వీడ్కోలు చెప్పి కారు ఎక్కగా, కారుకు ఎదురు వచ్చిన అన్నా, ఆపై వెనుదిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్లారు. 'చలోరే చల్' కార్యక్రమంలో భాగంగా, ఈరోజు నుండి పవన్ యాత్రను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనుండగా, ఆయన కాన్వాయ్ లో భారీ స్థాయిలో అభిమానుల వాహనాలు బారులు తీరాయి.
JanaSena Party Chief @PawanKalyan started to Kondagattu Anjaneya Swamy Temple from Party Office— JanaSena Party (@JanaSenaParty) January 22, 2018
JANASENA IN KONDAGATTU pic.twitter.com/7GPRCuVjZV
Categories:
Politics News
