సంక్రాంతి సందర్భంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ 'జై సింహా' చిత్రం థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ బొలెరో కారును ఒక్క చేతితో ఎత్తే సన్నివేశం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో గురించి మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ఓ ఆసక్తికర కామెంట్ చేశారు.
విష్ణు చైతన్య అనే నెటిజన్ ఈ వీడియోను ఆనంద్ మహీంద్రాకి పంపించి, దీనిపై స్పందించాలని కోరాడు. చైతన్య కోరిక మేరకు తన స్పందనను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సన్నివేశాన్ని చూసి మహీంద్ర కూడా అవాక్కయ్యారు. దీనిపై ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ..‘హాహా..బొలెరో కార్లను చెక్ చేయడానికి సర్వీస్ వర్క్‌షాపులు హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడనక్కర్లేదు’ అని సరదాగా ట్వీట్ చేశారు.
Haha. Now all our service workshops won’t need any hydraulic lifts anymore to do Bolero check-ups!! https://t.co/WiS6hcpT2h— anand mahindra (@anandmahindra) January 16, 2018
Categories:
Movies
